బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల కష్టాలు తెలుసుకునెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బయలుదేరనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ట్రిపుల్ ఐటీ నిర్వహణ కూడా కేసీఆర్ కి సాధ్యం కావడం లేదని విమర్శించారు. ఇంకా ట్రిపుల్ ఐటి ఎలా మంజూరు చేస్తారు ? అని ప్రశ్నించారు.
సిల్లి ముఖ్యమంత్రి కి సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. సమస్యలు సిల్లి అయితే… ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ వెంటనే విఆర్ఎస్ పొందటం ఖాయమని నిప్పులు చెరిగారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నీళ్లు, పవర్ కట్ చేయడం మూర్ఖత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక అధికారులు విద్యార్థులను భయపెడుతున్నారని మండిపడ్డారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదని బండి సంజయ్ అన్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే.. కొత్త వ్విఈడీద్యా సంస్థలు మంజూరు కష్టంగా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్తులు ద్వంసం చేయడం మానుకోవాలని అన్నారు. ఆలస్యంగా నైనా సమస్యలు గుర్తించడం మంచిదే నని బండి సంజయ్ ఈ సందర్భంగా కోరారు.
Hyderabad: మరో దారుణం… పబ్‌లో బర్త్ డే పార్టీ.. యువతిపై అఘాయిత్యం..!