తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిందా.. రాష్ట్రం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా.. కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే, వాళ్లు ఎక్కువ ఇచ్చినట్లు చూపెడితే.. నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తానని ఓపెస్ చాలెంజ్ విసిరారు..
బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. జులై 2 ,3 వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆమో మీడియాతో మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు పనులు ప్రారంభం ఆయ్యాయని తెలిపారు. మోడి తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ పదధికారులు,కేంద్ర మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. 3 వ తేదీన కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఫెరడ్ బీజేపీ బహిరంగ సభ వుంటుందని డీకే…
మాఫుల్ సపోర్ట్ సిన్హాకే అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో ఆసక్తి కరంగా మారింది. కాగా.. రాష్ట్రపతి అభ్యర్థిపై టీఆర్ఎస్ పార్టీ మరోమారు తమ మద్దతును స్పష్టం చేసిందనే వార్తలు గుప్పు మన్నాయి. ట్విటర్ వేదికగా తమ సపోర్ట్ ఎవరికో కేటీఆర్ స్పష్టం చేయడంతో.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు. భారత రాష్ట్రపతి ఎన్నిక విషయమై యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని, మా పార్లమెంటు…
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్ వేసుకుంటున్నారు. గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు…
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మూడు పార్టీల చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా TRS..కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తున్నా.. బీజేపీ తన సత్తా చాటే పనిలో ఉంది. పదవులు… జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటూ… తెలంగాణలో హడావిడి చేస్తోంది. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది. బీజేపీ వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో ఏమో.. ఆ స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కొందరు…
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…
బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చేసి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రారని..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తరుణ్ చుగ్ కామెంట్లు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది టీఆర్ఎస్ కు కాదని.. బీజేపీకి అని విమర్శించారు.…
టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బీజేపీ పార్టీ, ప్రధాని మోదీతో పాటు తరుణ్ చుగ్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో ప్రజల…
15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు మండి పడ్డారు. సిద్దిపేట పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. అనంతరం జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విధ్యార్థులు ఆత్మవిశ్వసంతో చదివి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధ్యార్థుల భవిష్యత్ బాగుండాలని మంచి…
కొల్లాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజకీయ హీట్ ఉత్కంఠ రేపుతుంది. కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నేతలిద్దరూ అధికార గులాబీ పార్టీకే చెందినవారే అయితే వీరిద్దరూ ఓపెన్ ఛాలెంజ్ చేసుకోవడం చర్చకు దారి తీస్తోంది. బహిరంగ చర్చకు సిద్దమంటూ ఒకరిపై మరొకరు ఛాలెంజ్ విసురుకోవడంతో.. ఆదివారం కొల్లాపూర్ లో టెన్షన్…