KTR: ఢిల్లీ వేదికగా కేటీఆర్ సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేసి ఇంటికి వెళ్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు.. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని విరుచుకుపడ్డ ఆయన.. బీజేపీ భావ దారిద్యానికి నిదర్శం.. మేం చేయాలనుకుంటే చాలా చేస్తాం.. కానీ, చేయబోమన్నారు.. 8 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? అని నిలదీసిన ఆయన.. ఇప్పటికీ గుజరాత్ లో కరెంట్ కష్టాలు ఉన్నాయి.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సొంత ఊర్లో కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.. పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారు.. కానీ, ఏమీ చేయలేరన్నారు.. ఇక, తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిందా.. రాష్ట్రం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా.. కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే, వాళ్లు ఎక్కువ ఇచ్చినట్లు చూపెడితే.. నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తానని ఓపెస్ చాలెంజ్ విసిరారు..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విపక్షాలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా కు మద్దతు తెలిపామని వెల్లడించారు కేటీఆర్.. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాం.. ఆయన్ను హైదరాబాద్ రావాలని ఆహ్వానించామని తెలిపారు.. భారత్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహారిస్తోందని మండిపడ్డ ఆయన.. అడ్డు అదుపు లేకుండా పోయింది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 8కి పైగా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికారాన్ని కైవసం చేసుకుంటారు.. గట్టిగా మాట్లాడితే ఏజెన్సీలను పురి గొల్పుతున్నారని ఎద్దేవా చేశారు.. ప్రజా స్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.. తిరగబడేది తెలంగాణ నుంచే రావొచ్చు అని హెచ్చరించారు. ఇక, బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం.. ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.న. యశ్వంత్ సిన్హా గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, భీష్ముడు మంచి వాడే.. కానీ, యుద్ధంలో కౌరవుల పక్షాన ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు మంత్రి కేటీఆర్.
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Tags
- bjp
- Delhi
- ktr
- Minister KTR
- telangana
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!