ప్రస్తుతం తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు
ఈ రోజు నుండి కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. ఇక, 529 రోజులే నీ పాలన అంటూ జోస్యం చెప్పారు బీజేపీ నేత తరుణ్ చుగ్.. సాలు దొర.. సెలవు దొర.. అంటూ వెబ్ డిజిటల్ బోర్డ్ ని ప్రతి చోటా పెడతామన్నారు..
తెలంగాణలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండి పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని, దానికితోడు మళ్ళీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల నడ్డి విరుస్తోందని మండి పడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు…
సిద్దిపేట రూరల్ మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. మండలంలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గడిచిన ఎనిదేళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? అంటూ మండిపడ్డారు. సీసీ రోడ్లు ఎన్ని? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
రాజకీయంగా పోటీని తట్టుకోలేని వారు పార్టీ నుంచి వెళ్లిపోవడం సహజమేనని దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు… అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి వారు పార్టీ నుంచి వెళ్లి పోయినందువల్ల ఎటువంటి నష్టం లేదని అన్నారు. అదే విధంగాతన నియోజకవర్గానికి చెందిన కరకగూడెం…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నుండి వచ్చి చేరే వారీ సంఖ్య పెరుగుతుంది. అధికార పార్టీ నుండి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కొత్తగా వచ్చి చేరిన నల్లాల ఓదెలు అయినా… తాజాగా PJR కూతురు విజయారెడ్డి అయినా .. భవిష్యత్ రాజకీయానికి ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నారు. ఓదెలుకి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్‌కి పెద్దగా కష్టం లేదు. కానీ సమస్య అంతా విజయారెడ్డి గురించే. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో.. ఒక కుటుంబానికి ఒకటే సీటు అని.. ఒకవేళ…