జేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిపై రాజాసింగ్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శల వర్షం గుప్పించారు. గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్ అంటూ ఆరోపించారు.
భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గాల మధ్య వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈరోజు కూడా అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం పేర్ల నమోదులో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. చిలికి చిలికి గాలి వాన మాదిరిగా ఒకరిపై ఒకరు దాడులు చేస్తుకున్నారు.
ప్రధాని మోడీ తల్లి పాల మీద తప్ప అన్నింటిపై పన్నులు వేశారని.. మోడీ పనుల ప్రధాని కాదు పన్నుల ప్రధాని అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, రిటైర్డు ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ఆదివాసీల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ ట్రాప్ లో పడను.. టీఆర్‌ఎస్ ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. రాజీనామా తోనే నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుంది అంటే… దళిత బందు ఇచ్చినప్పుడే.. రాజీనామా చేస్తా అని ప్రకటించారు. నన్ను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీ లో ఎన్నో సార్లు మాట్లాడిన అంటూ గుర్తు చేసారు. కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, అసెంబ్లీ లో కలిశా అంటూ పేర్కొన్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు ముంపు రైతులకు…
కేసీఆరే ఇంజినీర్, డాక్టర్, మేధావి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తారని.. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆయన ఆరోపించారు.
కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీపై టీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. అయితే.. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ నరసన బాటపట్టింది. అయితే.. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని టీఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని…