Madhuyaski Goud: కేసీఆరే ఇంజినీర్, డాక్టర్, మేధావి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తారని.. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఇప్పటికీ మొండా మార్కెట్‌లో రెంట్ కట్టకుండా వ్యాపారం చేసేవారని విమర్శించారు. తన అవినీతి బద్దలైతదనే కేసీఆర్ వరంగల్ వెళ్లారన్నారు. కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని మధుయాస్కీ అన్నారు. రజత్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాసర ఐఐఐటీ మెస్ కాంట్రాక్టర్ హరీష్ రావు బంధువు అని ఆయన ఆరోపించారు.
Bandi Sanjay: వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైంది.. తక్షణమే పే స్కేల్ ఇవ్వాల్సిందే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే యూనివర్సిటీలు బాగుండేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదేమైనా రాచరికం అనుకుంటున్నారా అని మండిపడ్డారు. అవినీతి చేయకున్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు ఇచ్చారు.. అవినీతి చేసిన కేసీఆర్‌పై బీజేపీ ప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్‌పై విచారణ చేయకపోతే ఆయన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని అంగీకరించినట్లేనన్నారు. సమైక్యాంధ్ర కంటే ఇప్పుడు దుర్భర పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయన్నారు. కేసీఆర్ ఎవర్నీ కలవకుండా ప్రజాస్వామ్యంలో దొరస్వామ్యాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయిందని ఆయన విమర్శించారు. చదువురాని వాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చారని మధుయాస్కీ ఆరోపించారు.