కేసీఆర్ ట్రాప్ లో పడను.. టీఆర్‌ఎస్ ను ఓడించడమే లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసారు. రాజీనామా తోనే నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుంది అంటే… దళిత బందు ఇచ్చినప్పుడే.. రాజీనామా చేస్తా అని ప్రకటించారు. నన్ను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీ లో ఎన్నో సార్లు మాట్లాడిన అంటూ గుర్తు చేసారు. కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, అసెంబ్లీ లో కలిశా అంటూ పేర్కొన్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు ముంపు రైతులకు మల్లన్న సాగర్ కి ఇచ్చిన ప్యాకేజీ ఇవ్వండి అంటే కూడా స్పందించలేదని తెలిపారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమే నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నియోజక వర్గం కె నిధులు ఇస్తున్నారని విమర్శించారు. మునుగోడు తెలంగాణలో లేదు.. సిరిసిల్ల, సిద్దిపేట,గజ్వేల్ వాళ్ళే ఉద్యమం చేశారా..? అంటూ ప్రశ్నించారు. ఉప ఎన్నికల వస్తేనే అభివృద్ధికి డబ్బులు అంటూ తెలిపారు. కాంగ్రెస్ లో కొందరు గిట్టని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదని, రాజీనామా చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేసారు. గతంలో కాంగ్రెస్ అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బీజేపీ బలపడే అవకాశం ఉందని చెప్పినా అంటూ గుర్తు చేసారు.
read also: Asia Cup 2022: అదరగొడుతున్న ఆసియా కప్ ప్రోమో.. నంబర్ వన్ మేరా ఇండియా..!!
రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్దికి ఓటేశా అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే నాకు అభిమానం, అవమానాలు ఎదురైనా..కార్యకర్తల కోసం దిగమింగా అంటూ తెలిపారు. ఎప్పుడు స్వార్దంతో మాట్లాడలేదని, కాంగ్రెస్ బాగు పడాలని కొన్ని మాటలు మాట్లాడానని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవం పెరిగేలా పని చేసిన అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కి ఎప్పుడు వ్యతిరేకంగా పని చేయలేదని, కెసిఆర్ పై సరిగా ఉద్యమం చేయడం లేదని అన్నారు. తెలంగాణ కి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను ముందు పెట్టినా.. మూడేళ్లు సైలెంట్ గా ఉన్నా అంటూ మండిపడ్డారు. కెసిఆర్ నీ బొంద పెట్టే సమయం ఆసన్నం మైందని అన్నారు. కెసిఆర్ కి వ్యతిరేకంగా బలంగా పని చేస్తే.. దానితో కలిసి పని చేయాలని కోరిక వుందని అన్నారు. నాకు నిలకడ లేక కాదు.. నిలకడ ఉంది కాబట్టే… కాంగ్రెస్ లో ఉన్నా అంటూ పేర్కొన్నారు. నేను పార్టీ మారాల్సి వస్తే.. నా భువనగిరి, మునుగోడు ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకుంటా అంటూ స్పష్టం చేసారు. కెసిఆర్.. ఉసి గొలిపితే ఎన్నికలకు పోను, కేసీఆర్ ట్రాప్ లో పడను అంటూ చెప్పుకొచ్చారు. కెసిఆర్ వ్యూహంలో పావును కాదలుచుకో లేదంటూ స్పష్టం చేసారు. కాంగ్రెస్ బలహీన పడింది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కెసిఆర్ నీ కొట్టగలుగు తుందని చెప్పిన అంటూ చెప్పకొచ్చారు. నా జీవిత లక్ష్యమే.. టీఆర్‌ఎస్ ను ఒడించడమే అంటూ స్పష్టం చేసారు. జైల్లో కి వెళ్లి వచ్చిన వాళ్ళు నీతులు చెప్తున్నారు మాకు అంటూ చురకలంటించారు. వాళ్ళతో నీతులు చెప్పించుకోవల్సిన అవసరం మాకు లేదంటూ మండిపడ్డారు.
Asia Cup 2022: అదరగొడుతున్న ఆసియా కప్ ప్రోమో.. నంబర్ వన్ మేరా ఇండియా..!!