TPCC President Revanth Reddy Made Comments On TRS and BJP Governments.
తెలంగాణలో గత వారం భారీ వర్షాలు కురియడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు నిండిపోవడంతో మత్తడి పోసి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరింది. ఎగువన రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురియడంతో తెలంగాణలోని జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. అంతేకాకుండా..రాష్ట్రంలో రైతులు తీవ్ర పంటనష్టాన్ని చవిచూశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మిల్లుల వద్ద ధాన్యం బస్తాలు కుప్పలుగా పేర్చిపెట్టారు.
అయితే ఈ భారీ వర్షాలకు ధాన్యం బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తింది. దీంతో టీఆర్‌ఎస్ నేతలు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం వల్ల ధాన్యం నష్టపోయామంటూ ఆరోపణలు గుపిస్తున్నారు. ఈ దీనిపై తాజాగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ – టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ.200 కోట్ల విలువైన ధాన్యం నీళ్లపాలైందని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఇవి మోడీ – కేసీఆర్ జేబులో డబ్బులు కాదని, తెలంగాణ ప్రజలు రక్తం, చెమట దారపోసి కట్టిన పన్నుల సొమ్ము అంటూ.. బాధ్యత లేదా రెండు ప్రభుత్వాలకి…!? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.