అవినీతి పాలన పోయి.. ప్రజా స్వామ్య ప్రభుత్వం రావాలి అంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.. నా స్వార్థం కోసం నేను రాజీనామ చేయలేదు... ఫామ్‌హౌస్‌లో పడుకున్న సీఎం మునుగోడు రావాలని నేను రాజీనామ చేశానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
జనగామ జిల్లాలో బండి సంజయ్ 18వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. జాఫర్గడ్ క్రాస్ రోడ్డు, జఫర్గడ్ విలేజ్, అశ్వారావుపల్లి మీదుగా మీదికొండ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీల అగ్రనేతలు మునుగోడు బాట పడుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇలా అగ్ర నేతలంతా మునుగోడు బాట పడుతున్నారు
ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తాంటూ వై.ఎస్ షర్మిళ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో షర్మిల పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆమె మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అని కేసీఅర్ మోసం చేశారని మండిపడ్డారు. తీసుకున్న రుణాలు కట్టలేక ఉన్న పొలాలు అమ్ముకుంటున్నామన్నారు. బ్రతుకు దెరువు లేక ఇంకా బొంబాయి పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. కేసీఅర్ ప్రభుత్వంతో మాకు ఏం మేలు…
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజలు కోరుకుంటే రాలేదు..! అక్కడి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో గెలుస్తామని, 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని జాతీయ పార్టీలు కలలు కంటున్నాయని ఎద్దేవ చేశారు. అది జరగదని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడేళ్లలోనే మూడు ఉపఎన్నికలు వచ్చాయన్నారు. హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లలో ఉపఎన్నికలు…
ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే మృతి చెందారు. నేడు కృష్ణయ్య అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూరల్ మండలంలో 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో కృష్ణయ్య అనుచరులు, టీఆర్ఎస్…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఆయన ఎమ్మెల్యే రాజీనామాకు వెంటనే స్పీకర్ ఆమోదం తెలపడంతో.. ఉప ఎన్నికల అనివార్యం అయ్యింది.. అయితే, తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. విజయం మాదంటే మాదేనంటూ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. ఇప్పటికే…
Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వల్ల గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని…
‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి…