జనగామ జిల్లాలో బండి సంజయ్ 18వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా.. జాఫర్గడ్ క్రాస్ రోడ్డు, జఫర్గడ్ విలేజ్, అశ్వారావుపల్లి మీదుగా మీదికొండ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచనళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని తెలిపారు. రేపటి అమిత్ షా మునుగోడు సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. మునుగోడు ప్రజలు బీజేపీవైపే ఉన్నారని, కాంగ్రెస్ పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అనంతరం మీడియా సమావేశంలో డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని విమర్శించారు. ఉత్పత్తి సంస్థలకు నష్టం తెస్తున్నారని మండిపడ్డారు. డిస్కమ్ లకు కట్టాల్సిన బకాయిల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు. అవి బయటపెట్టండని డిమాండ్ చేశాఉ. డిస్కమ్ లకు 20 వేల కోట్లకు పైగా కట్టాలని, కానీ.. 1750 కోట్లు కట్టాలి అని వెబ్ సైట్స్ లో ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇందుకు 50 కోట్లు కేవలం బకాయిలే ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి మాత్రం మేము బకాయిలు లేదు అంటున్నారని, ఎవ్వరిని నమ్మాలని ఎద్దేవ చేశారు. 4000 కోట్ల ఆదాయం కోసం మళ్ళా కరెంట్ బిల్స్ పెంచుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత కారణంగా సామాన్యుల పైనా భారం పడుతుందని మండిపడ్డారు.
రాష్ట్ర జెన్కో కు ఉన్న అప్పులు ఎంత? మొదట చెప్పాలని ప్రశ్నించారు. కరెంట్ ఉత్పత్తి కేంద్రాల అప్పుల పైనా శ్వేతా పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మోటార్లు పెట్టాలని చెప్పినారు తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వద్దు అని కేంద్రం ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని బండి ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం, ఎన్నికల వరకు కరెంటు కొంటారు తర్వాత చేతులెత్తేస్తారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా పోయిందని బండి సంజయ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాల బండి సంజయ్ పాదయాత్ర మొత్తం 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇవాళ మీదికొండ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
Mahesh Babu: ఫస్ట్ టైమ్.. షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్.. పిచ్చెక్కిపోతున్న అభిమానులు