ఫామ్‌హౌస్‌లో పడుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మునుగోడు రావాలనే రాజీనామా చేశానంటూ పేర్కొన్నారు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… రేపు మునుగోడులో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇతర బీజేపీ నేతలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పాలన పోయి.. ప్రజా స్వామ్య ప్రభుత్వం రావాలి అంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.. నా స్వార్థం కోసం నేను రాజీనామ చేయలేదు… ఫామ్‌హౌస్‌లో పడుకున్న సీఎం మునుగోడు రావాలని నేను రాజీనామ చేశానన్నారు.. స్వార్థం కోసం అయితే ఉప ఎన్నికకు పోయే వాడిని కాదని స్పష్టం చేశారు.. మునుగోడు ప్రజలు తమను తాము గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.
Read Also: Gautam Adani: తగ్గేదే లే అంటున్న గౌతం అదానీ.. మరో భారీ డీల్..
ఇక, మునుగోడులో టీఆర్‌ఎస్ సభ పెట్టుకోవడంలో అర్థం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఎన్నికల ముందు బీజేపీని బద్నాం చేయడం టీఆర్ఎస్‌కు అలవాటు అన్నారు.. ఎనిమదేళ్లుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారు.. బీజేపీ మీ లాగా కుటుంబ పార్టీ కాదు… మీ లాగా అవినీతి పార్టీ కాదన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం సీఎం కేసీఆర్‌కి అలవాటు అని గుర్తుచేసిన కిషన్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫామ్‌హైస్‌లో వేసుకుంటారు అని సెటైర్లు వేశారు. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇక, కేసీఆర్‌కు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలే కనిపిస్తాయి.. గజ్వేల్, ఆయన కొడుకు సిరిసిల్ల, అల్లుడి సిద్దిపేటే అభివృద్ధి చెందుతాయి.. హైదరాబాద్ నడిబొడ్డున కూడా అభివృద్ధి ఉండదని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.