మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం…
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది. దీంతో ఈటల రాజేందర్ గత వారం టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామా చేయడం ఆలస్యం లేదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈటలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే.. హరీష్ రావు రంగంలోకి దిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైన టీఆర్ఎస్…
రాష్ట్రం ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్ సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నాను.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా.. నా రాజీనామా తర్వాత అయినా పెన్షన్‌లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని..…
రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.. పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది తెలంగాణ కేబినెట్.
ఈటల.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతా అని బీజేపీలో చేరడం ఎంటో అర్దం కావడం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. తెరాస అవినీతికి రక్షణగా నిలిచింది బీజేపీ. ఈటల బీజేపీలో కలుస్తారని నేను ఊహించలేదు. ఆయన బలహీనత బయట పడింది. ఈటల బీజేపీలో చేరుతూ తన వ్యక్తిత్వం కోల్పోయారు. ఇక కాంగ్రెస్ నీ ఎవడో నడపడు. కాంగ్రెస్ నీ నడిపిస్తుంది రాహుల్ గాంధీ. ఈటల స్థాయిని స్వయంగా ఆయనే తగ్గించుకున్నారు. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడు.…
సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ డబ్బులు, దౌర్జన్యంతో గెలవలేడని, ఇది కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధం అని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు గులాబీ జెండాను మోసానని.. కష్టకాలంలో అండగా ఉన్న నన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను మాత్రం పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను ఎవరూ కొనలేరు అని ఈటల పేర్కొన్నారు.…
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి…రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది…ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరకముందే ఆ పార్టీలో కాకరేగింది.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందే ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి.. ఇక, పార్టీలో చేరికకు ముందు.. ఢిల్లీలో మకాం వేసి.. తనకుఉన్న అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు పెట్టిన ఈటల.. ఈ సందర్భంగా హామీ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.. కానీ, ఈటల రాజేందర్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం…