రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.. పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది తెలంగాణ కేబినెట్.