తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ త్వరలో రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… పార్టీ మారడం పై పార్టీ కార్యకర్తలను చర్చించి పూర్తి వివరాలు అందిస్తా అన్నారు. నేను ఎప్పుడూ పదవి కోసం ఆశించలేదు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో ఓటరు మమ్మల్ని నమ్మి ఓటు వేసిన వారికి మా వంతు కృషి చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ వారితో ఎలాంటి చర్చలు జరపలేదు. ఎప్పుడు నేను తెలుగుదేశం…
గజ్వేల్ లో సిఎం కేసిఆర్ కాలు పెట్టడం చాలా అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారిందని..గజ్వేల్ ప్రజలు కలలో కూడా ఊహించనంత అభివృద్ధి జరిగిందన్నారు. కసికడు నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తెచ్చి…
ఈటల ఎపిసోడ్ తో టీఆర్ఎస్ లో పెద్ద అలజడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈటల టీఆర్ఎస్ ను వీడటంతో.. ఆయన స్థానాన్ని మరో బీసీ నాయకుడితో భర్తీ చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి రమణ వెళుతున్నట్లు మీడియాలో వార్తలు…
కరీంనగర్ జిల్లా అంటే సిఎం కేసీఆర్ కు ఎంతో మక్కువ అని.. ఈ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు. 14 కిలోమీటర్లు పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు లైటింగ్ ఏర్పాటు చేశామని..ఇప్పటికే ఐటి టవర్ ప్రారంభం కావడం అక్కడ పనులు జరుగుతున్నాయన్నారు. సౌత్ ఇండియాలో మెదటిసారి కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది పడిందని..గండిపేట చెరువు కేబుల్ బ్రిడ్జి త్వరగా పనులు జరిగి ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు కరీంనగర్…
ఈటల రాజేందర్ నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని స్పీకర్ అంగీకరించారు, ఇక బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరో ఆరుగురు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. అయితే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్,…
ఈటల రాజేందర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఎన్నిక అభివృద్ధి చేసిన పార్టీకి…అభివృద్ధి చేయని పార్టీలకు మధ్య పోటీ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేస్తూ మాట్లాడిన మాటలకు అభ్యంతరం చెబుతున్నామని.. ఏది ధర్మం… ఏది అధర్మం అని ఈటలపై మండిపడ్డారు. కేసీఆర్, టిఆర్ఎస్ లేకుంటే ఈటల ఎక్కడ ఉండేవారు ? ఈటలను అనేక విషయాల్లో కేసీఆర్ నమ్మారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తనకు తాను తప్పులు…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.. అయితే, తనతో పాటు.. తన అనుచరులను కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్పించాలని భావిస్తున్న ఈటల.. అందరూ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నారట.. ముఖ్యనేతలతో తనతో పాటు హస్తినకు…
ఈటలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరూ ఒక్క గింజ కొనలేదని, కానీ మన రాష్ట్రంలో తడిసిన, మొలకెత్తిన, తాలు ఉన్న, 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను కొని రైతాంగాన్ని ఆదుకున్నామని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం ఈటల రాజేందర్…
ఈటల చేస్తున్న ఆరోపణలపై హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్ డబ్బులు పంపిస్తే… రెండున్నర యేండ్ల నుండి ఎందుకు మాట్లాడలేదని.. ఇన్నాళ్లు నిద్ర పోయావా? అని ఫైర్ అయ్యారు. ఈటెల ప్రస్ట్రెషన్ లో ఉన్నాడని.. పైసలు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈటెల వల్ల..ఊరు కాలదు..పేరు లేవదు అని..అధికారంలో ఉన్నప్పుడే ఈటల మీద పోరాడా ? ఇప్పుడు పోరాడతా అని పేర్కొన్నారు. ఇవాళ అమర వీరుల స్థూపం వద్దకు వెళ్ళిన…