ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది. దీంతో ఈటల రాజేందర్ గత వారం టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామా చేయడం ఆలస్యం లేదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈటలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే.. హరీష్ రావు రంగంలోకి దిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైన టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హుజూరాబాద్ నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు, ఇతర నాయకులు ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. అంతేకాదు జమ్మికుంటలో జై ఈటల అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ తీశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక అనంతరం టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు, ఇతర నాయకులు జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద పార్టీకి రాజీనామా చేశారు.