పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి…రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది…ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన చేయలేదని.. తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం అయిన తీసుకుంటానని ఎల్ రమణ పేర్కొన్నారు. కాగా ఎల్.రమణకు టిఆర్ఎస్ గాలం వేస్తున్నట్టు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు టిఆర్ఎస్ లోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎల్.రమణ కు అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.