రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ అని.. రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేము సేవా రాజకీయాల్లో ఉన్నామని.. గతంలో రాజీనామా చేసి, స్పీకర్ కు రాజీనామా ఇవ్వలేదు ఎందుకు ? అని నిలదీశారు. మీరు రాళ్లతో కొడితే… మేం చెప్పులతో కొడతామని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు సుధీర్ రెడ్డి.
read also : నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం…
ఓటుకు నోటుకు కేసులో రేవంత్ దొరికాడని…దీనిపై కాంగ్రెస్ లోని సీనియర్లు రోధిస్తున్నారని చురకలు అంటించారు. కాంగ్రెస్ లో టికెట్లు మాత్రమే కాదు… పదవులు కూడా అమ్ముకుం టున్నారని..ఠాకూర్ కు రూ. 25 కోట్లు ఇచ్చి మరీ రేవంత్ రెడ్డి పిసిసి తెచ్చుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. రాజస్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు..వాళ్లను కూడా రాళ్లతో కొట్టమంటారా ? అని ప్రశ్నించారు సుధీర్ రెడ్డి.