సూర్యాపేట జిల్లా : బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల పై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని…తెలంగాణ హాక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలనట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని…రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదన్నారు. నదీ జలాలను న్యాయంగా వాడుకోవడం పై జగన్ కి ఎంతో వివేకంతో కేసీఆర్ స్పష్టం చేసారని.. గోదావరి నది పై సమస్యలను పక్క రాష్ట్రాలతో సులభంగా తీర్చుకున్నామని గుర్తు చేశారు.
read also : కుప్పకూలిన వైమానికి దళ విమానం.. 92 మందితో వెళ్తుండగా ప్రమాదం..
సమస్యల పై పొరుగు దేశాలతో కేంద్రం శాంతి చర్చలు చేస్తున్నాయని.. రాష్ట్రాలకు మాత్రం గిల్లిగజ్జాలు ఎందుకు? అని ప్రశ్నించారు…నీటి వినియోగంపై వందల ఉత్తరాలు రాసినా కేంద్రం పట్టించుకోవడమేలేదని..కొత్తగా వచ్చినా బండి సంజయ్ కి అవగాహన లేదని చురకలు అంటించారు… రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని ప్రతిపక్షాలు ద్రోహులుగా మిగిలిపోతాయని హెచ్చరించారు.