తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక,…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను సిఎం కెసిఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్, విద్యార్ధి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ…
ఆయన రెండు దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నారు. ఆయన పేరు చెప్పగానే పార్టీ ఏంటో.. పార్టీ గుర్తు ఏంటో ఇట్టే చెప్పేస్తారు ఆ నియోజకవర్గం జనం. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలోకి మారారు. ఎన్నికల గుర్తు కూడా మారింది. త్వరలో జరిగే ఉపఎన్నికలో మరోసారి బరిలో దిగబోతున్నారు. ఈ సమయంలో ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేయడానికి నానా తిప్పలు పడుతున్నారట ఆ నాయకుడు. ఆయన ఎవరో ఏంటో ఈస్టోరీలో చూద్దాం. బీజేపీ ఎన్నికల గుర్తును…
బీజేపీలో చేరిన ఈటలపై మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అవినీతి నాయకుడని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని అలాంటి అవినీతి నాయకుడిని బీజేపీలో చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరువాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాదు, మోత్కుపల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు. తనలాంటి వారు బీజేపీలో ఇమడలేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభవం…
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలలో విశ్వాసం పోయిందన్న ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారన్నారు.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరుగుతుందన్న రేవంత్… సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం త్వరలో తిరస్కరిస్తుంది.. మేధావులు, మీడియా దీన్ని గమనించాలని సూచించారు.. ఇక, రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి…
హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ స్కీమ్ పెడితే తప్పేముంది.. స్కీమ్ ద్వారా రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది ? టీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వలస కాలనీ అవుతాదా అనే ఆవేదన ఉండేది.. పిడికడు మందితో ఉద్యమం స్టార్ట్ చేశాం.. తెలంగాణ ఆకాంక్ష 2014…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… షర్మిల దీక్షపై స్పందించిన ఆయన.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయడం అర్ధ రహితం అన్నారు.. మీ నాన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. తన రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించులేక నిరుద్యోగ దీక్షలు చేపట్టారంటూ సెటైర్లు వేశారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు… తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కండువా కప్పి.. కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇక, కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కౌశిక్‌రెడ్డి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, ఈ మధ్య ఆయనకు సంబంధించిన…
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ…