తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక, ఏదో విమర్శల కోసం కేసీఆర్‌ని అంటున్నారు తప్ప.. అయన చేస్తున్న కార్యక్రమాలు అందరికి ఇష్టమేనన్న ఆయన.. దేశం మొత్తం తెలంగాణ లాంటి అభివృద్ధి జరగాలంటే అయన ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.