తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి… సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలలో విశ్వాసం పోయిందన్న ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారన్నారు.. తెలంగాణలో కేసీఆర్, టీఆర్ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరుగుతుందన్న రేవంత్… సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం త్వరలో తిరస్కరిస్తుంది.. మేధావులు, మీడియా దీన్ని గమనించాలని సూచించారు.. ఇక, రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి..