కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో పార్టీలో చేరారు… తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కండువా కప్పి.. కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇక, కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కౌశిక్‌రెడ్డి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, ఈ మధ్య ఆయనకు సంబంధించిన ఓ ఆడియో టేప్ లీకై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. కౌశిక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ.. ఆ వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం.. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది.