హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ స్కీమ్ పెడితే తప్పేముంది.. స్కీమ్ ద్వారా రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది ? టీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వలస కాలనీ అవుతాదా అనే ఆవేదన ఉండేది.. పిడికడు మందితో ఉద్యమం స్టార్ట్ చేశాం.. తెలంగాణ ఆకాంక్ష 2014 లో సాకారం అయ్యిందని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఎన్నికల్లో పార్టీలు ఓడడం గెలవడం ప్రజాస్వామ్యంలో
నిరంతరం ప్రక్రియేన్న కేసీఆర్.. ఇది కష్టపడి సాధించిన రాష్ట్రం తెలంగాణ.. శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు… ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు.. ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యాను.. ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను కయ్య కయ్య మాట్లాడమన్నారు… నా నుంచి కాదు అని చెప్పిన, వ్యవసాయం మీద మాట్లాడనికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లును కలసి చర్చించా.. ఆ రోజు నేను వ్యవసాయం మీద మాట్లాడితే… అప్పట్టి స్పీకర్ ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.
కులం లేదు… మతం లేదు.. జాతి లేదు… వాటిని పట్టించుకోం.. సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు కేసీఆర్.. రైతు బంధు లక్ష్యం నెరవేరింది,
తలసరి విద్యుత్ వినియోగంలో ఇప్పడు తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్న ఆయన.. కేసీఆర్ కిట్ పెట్టాలని ఎవరు అయిన ధర్నా చేసారా ? ధరణి తీసుకురావాలని ఎవరు అయిన ధర్నా చేసారా ? అంటూ ప్రశ్నించారు.. హరిత హారంతో తెలంగాణ పచ్చ బడింది.. తెలంగాణ బార్డర్ దాటిన వెంటనే చెట్లు ఉండవన్న ఆయన.. నోరు ఇచ్చారని కుక్కులు మోరిగినట్టు మొరిగితే ఎట్లా ? అంటూ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.. ప్రజలు వరుస ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపిస్తున్నారు.. ప్రతి ఎలక్షన్ లో ప్రజలు టిఆర్ఎస్ ను దీవిస్తున్నారని తెలిపారు.. రైతు బంధు పథకం తయారు కోసం ఆరు నెలలు నా తల పగలగొట్టుకున్నాన్న కేసీఆర్.. మేం తెలంగాణ రైతులం అని కాలర్ ఎగర వేసుకునే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. దళిత బంధు చూసి కొందరికి బీపీ ఎక్కువ అవుతుందని కామెంట్ చేసిన ఆయన.. ఎన్నికలు ఇంకా రెండున్నర ఏళ్లకు వస్తాయి.. దళిత బంధు పథకంతో ఏం చేస్తారు అన్నది పర్యవేక్షణ ఉంటుందన్నారు.. దళిత బంధు స్కీమ్ తమాషా పథకం కాదన్న ఆయన.. హుజురాబాద్ ను దళిత బంధు స్కీమ్ కోసం పైలెట్ గా తీసుకున్నామన్నారు.. స్కీమ్ పెడితే రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది? టిఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? అంటూ ప్రశ్నించిన ఆయన.. కరీంనగర్ నాకు సెంటిమెంట్ జిల్లా.. నాకు స్వార్థం ఉంటే దళిత బంధు గజ్వేల్ లో పెట్టెవాన్ని కదా అన్నారు. ఇక, యువతదే తెలంగాణ.. రాష్ట్రం బాగుండాలంటే యువత బాధ్యత తీసుకోవాలి.. రాజకీయ పార్టీ అంటేనే పెద్ద పవర్ అన్నారు..