సీఎం కేసీఆర్ ఇక జైలుకు పోవడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణలపై త్వరలోనే సీబీఐ, ఈడీ విచారణ చేస్తుందని వంద శాతం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గిస్తే రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పెట్రో, డీజీల్‌పై పన్నును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు.
డిజీల్ ధరలు పెరిగినందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామనడం భావ్యం కాదన్నారు. ఇది కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆయన అన్నారు. రైతుల ఉత్పత్తుల మీద టీఆర్‌ఎస్ నాయకులు స్ల్మంగ్లింగ్ చేస్తు కోట్లు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాగా కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ర్టాన్ని ఆగం చేయాలని చూస్తున్నాడన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేసీఆర్ విరమించుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంలో నెపాన్ని కేంద్రం మీదకు తోసి తెలంగాణలో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.