బండ ప్రకాష్ కు మంత్రి పదవి దక్కేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు బండప్రకాశ్. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు ప్రకాష్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందారు.
తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా సనిచేశారు. వరంగల్ పురపాలక సంఘం ఉపాధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడైన ఆయన 2017లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. 2018 మార్చి 23న టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 జూన్ లో పార్టీ పార్లమెంటరీ సమావేశంలో టిఆర్ఎస్ పక్ష ఉప నాయకుడిగా బండ ప్రకాష్ ని ని నియమించారు కేసీఆర్. పార్టీ అధినేతకు బండ ప్రకాష్ వీరవిధేయుడిగా వున్నారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తనను రాష్ట్ర రాజకీయాలకు తీసుకురావాలని కేసీఆర్ భావించారని, అందుకే రాజ్యసభ నుంచి తెలంగాణలోని పెద్దల సభకు వస్తున్నానన్నారు బండ ప్రకాష్. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు స్థానం దక్కింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా, రాజ్యసభ ఎంపీగా వున్న వ్యక్తిని శాసనమండలికి రప్పించడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏదో వుందనే చర్చ సాగుతోంది. బండ ప్రకాష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ముదిరాజ్ సామాజిక వర్గ నేతలు ఆశాభావంతో వున్నారు. ఈటల రాజేందర్ కు మంత్రివర్గంనుంచి ఉద్వాసన పలకడంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా బండ ప్రకాష్ కి మంత్రిమండలిలో బెర్త్ లభించవచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!