టీఆర్‌ఎస్ పార్టీలో శిలాఫలకం చిచ్చురేపింది. స్వంత పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. తాండూరు గులాబీ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వర్గం నేతలు అభ్యంతరం తెలపడంతో శిలాఫలకం ధ్వంసం అయింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా వుంది. పెద్దేముల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.