టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీఓ 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీఓ వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర. Read Also:సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్ సీనియారిటీ చిచ్చు పెట్టి…
గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతుందని అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్‌లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్‌లా…
ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది… ప్రజాకవిగా తన స్వరం విప్పిన గోరటి వెంకన్న పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. తెలంగాణ యాశలో.. అడవి, పల్లెలు, అనగారిన వర్గాల బాధలే కాదు.. ప్రేయసిపై పాట రాసికూడా అందరినీ ఆకట్టుకున్నారు.. ఇప్పుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.. 2021 ఏడాదికి తెలుగు సాహిత్యంలో వల్లంకి తాళం కవితా సంపుటికి గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు…
ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలో దాదాపు 4 రోజుల పాటు ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కలకలం రేగింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా…
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తరుచుగా వాహనాల పార్కింగ్ లేకవపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బల్కంపేట ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయానికి…
సంగారెడ్డిలోని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తుల హాజరయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి హరీష్ రావు…
నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కెసీఆర్ సంక్షేమ పథకాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో అమలవుతున్న పథకాలతో పాటు సమస్యలపై చర్చించారు. పోడు భూముల సమస్య, మెడికల్ కాలేజీ నిర్మాణం, దళిత బంధు పథకం అమలు పై కేసీఆర్ చర్చించారు. Read Also: పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలు మూసివేత…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లిక్కర్‌పై తాజాగా చేసిన కామెంట్లు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, సోమువీర్రాజు వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… సోషల్ మీడియా వేదికగా లిక్కర్ అమ్మకాలపై స్పందించిన ఆమె.. చీప్ లిక్కర్‌తో బీజేపీ.. ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్…