విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డిలోని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తుల హాజరయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. విద్యపై ప్రత్యేక దృష్టితో ఎక్కువ నిధులను కేటాయిస్తున్న ప్రభుత్వం ఒక్క టీఆర్‌ఎస్ అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై అమితమైన అభిమానం చూపిన సబితా ఇంద్రారెడ్డి ప్రేమను మరువలేం, బయటకు ఎలా ఉన్నా లోపల మాత్రం ఉద్యమాలకు ఊతమిచ్చే వారని హరిష్ రావు అన్నారు.
Read Also: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డైమండ్స్ పట్టివేత
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
అనాధ పాఠశాల నిర్మాణానికి తమ వంతుకృషి చేస్తామని మంత్రి తెలిపారు. నిరుపేదలకు నెలనెల పెన్షన్లు అందించిన భూపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. బాలికల హస్టల్, డిగ్రీ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తామని వెల్లడించారు. రాయసముద్రం చెరువును సిద్ధిపేట లోని కోమటి చెరువుకు ధీటుగా తయారుచేస్తామని మంత్రి వెల్లడించారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గురుకుల పాఠశాలల ద్వారా దేశంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యపై పెట్టిన పెట్టుబడి భావితరాల భవిష్యత్తు, మనుగడ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!