బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తరుచుగా వాహనాల పార్కింగ్ లేకవపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బల్కంపేట ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 1161 గజాల విస్తీర్ణంలో జీ3 అంతస్తుల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్టు తెలిపారు. 40 నాలుగు చక్రాల వాహనాలు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే మొదటి, రెండోవ అంతస్తులో 24 షాపులు భక్తుల కోసం 9 గదులు ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ భవన నిర్మాణ పనులను మరో ఆరునెలల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
Read Also:ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారు: షర్మిళ
మొత్తం 1161 గజా స్థలంలో 638 గజాల స్థలం ఆలయానికి సంబంధించినది కాగా, మరో 523 గజాలు జీహెచ్‌ఎంసీకి చెందిన ఈ స్థలాన్ని దేవాదాయ శాఖకు బదీలీ చేసినట్టు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.6లక్షలతో చేపట్టనున్న బోర్ వెల్ పనులను కూడా ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. ఆలయం లోపల, బయట నూతన క్యూలైన్ల ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారి దర్శనానికి ప్రతి మంగళవారం, ఆదివారం భక్తులను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు.