రేవంత్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు. అనంతరం దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఉత్సహం కనిపిస్తుంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని 2014, ఆగస్ట్ 15 న సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. ఆరేండ్లు అయిన.. దళితులకు భూములియ్యలేదు. దళితులకు భూములు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. టీఆర్ఎస్.. 2018 నుండి ఎక్కడ ఎన్నికలు వచ్చిన డబ్బు వెదజల్లుతుంది అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రగతి భవన్ ను అంబెడ్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చాలి. ప్రాజెక్టుల పేరుతో.. కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష కోట్ల రూపాయలను దోచుకుంది. సీఎం గా పనిచేసిన దామోదర్ సంజీవయ్య ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు. లక్ష 91వేల ఉద్యోగాలు ఎందుకు భర్తి చేయడం లేదు. మహిళా సంఘాలకు రుణాల వడ్డీ ఎందుకు చెల్లించడం లేదు. తెలంగాణ వచ్చి మళ్లీ దొరల పాలనలోకి వెళ్ళింది. 2022, డిసెంబర్ లోనే ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.