దాడులకు, కేసులకు కాంగ్రెస్ భయపడదు అని మధు యాష్కీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం.. కాంగ్రెస్ కార్యకర్తలపైన, నాయకులపైన కేసులు పెడుతూ దాడులు చేస్తున్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు రక్షణ కల్పించేందుకు కాల్ సెంటర్ పెడుతున్నాం అని తెలిపారు. న్యాయ సలహాలు అందిస్తాం.. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంభం పాలన చేస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి పాలించే హక్కు లేకుండా పోయింది. హైదరాబాద్ గతంలో విశ్వ నగరం చేస్తానని విష నగరంగా మార్చారు. విద్య, ఉద్యోగాలు ఇవ్వమంటే మత్తు మందులు ఇచ్చి యువతను మత్తులో పడేస్తున్నారు అన్నారు. ఇక బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబంపైన నిష్పక్షపాత విచారణ జరగాలి. కల్వకుంట్ల కుటుంబం అక్రమాలతో కోట్లు గడిస్తున్నారు అని పేర్కొన్నారు.