ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు.
AUS vs NZ Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టామ్ లాతమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా దూరమైన మార్క్ చాప్‌మన్ స్థానంలో జిమ్మీ నీషమ్ ఆడుతున్నాడు. మరోవైపు ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్ స్థానంలో హెడ్ ఆడుతాడు.…
World Cup 2023 Australia vs Sri Lanka 14th Match Preview: అయిదుసార్లు ఛాంపియన్ ట్యాగ్.. బలమైన బ్యాటింగ్ లైనప్.. స్టార్ బ్యాటర్లను సైతం హడలెత్తించే బౌలర్లు.. నాణ్యమైన ఆల్‌రౌండర్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్ 2023లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అయినా.. పేలవ ఆట తీరుతో ప్రపంచకప్ 2023లో ఇంకా బోణీ కొట్టలేదు. పాయింట్ల పట్టికలో పసికూనల కంటే కింద అట్టడుగున ఉంది. ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం…
Travis Head set to join Australia World Cup Squad: భారత్ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ 2023లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. నేడు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి మెగా టోర్నీలో బోణీ చేయాలనీ చూస్తోంది. ఇక పాకిస్తాన్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్ (అక్టోబర్ 20)కు…
చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్ టార్గెట్ 270 పరుగులు. తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసింది.