Rohit Sharma On Losing WTC Final Against Australia: భారత క్రీడాభిమానులు ఏదైతే భయపడ్డారో.. అదే జరిగింది. ఎప్పట్లాగే ఈసారి కూడా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చేతులెత్తేసింది. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియా రన్నరప్‌కే పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ విభాగం విఫలమవ్వడం, దాంతో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించడమే.. తమ కొంపముంచిందని పేర్కొన్నాడు. తాము గెలిచేందుకు గట్టిగా ప్రయత్నించాం కానీ, దురదృష్టవశాత్తూ ఓడిపోయామని చెప్పుకొచ్చాడు.
Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘టాస్ గెలిచి, ఆస్ట్రేలియాను కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కి దించడంతో, మేము బాగానే ప్రారంభించామని నేను అనుకున్నారు. తొలిరోజు ఆటలో భాగంగా.. మొదటి సెషన్‌లో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. కానీ.. ఆ తర్వాతి సెషన్ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లు మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. ఇందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మ్యాచ్‌పై పట్టు చిక్కిందనుకున్న సమయంలో.. ట్రెవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్‌లు అద్భుతంగా ఆడారు. వారి భాగస్వామ్యం ఆస్ట్రేలియాను ముందంజలో ఉంచింది. ఒక రకంగా చెప్పాలంటే.. తొలి ఇన్నింగ్స్‌లో వాళ్లు చేసిన పరుగులతోనే, ఆస్ట్రేలియా సగం విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు మేము సాయశక్తులా ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలో భాగంగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను త్వరగా ఔట్ చేయాలని అనుకున్నాం. అందులో మేము సక్సెస్ కూడా అయ్యాం’’ అని వెల్లడించాడు.
Tamil Nadu: ఆర్మీ జవాన్ భార్యపై 40 మంది దాడి.. అసభ్య ప్రవర్తన
కానీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం కలిసొచ్చిందని, అదే తమ కొంపముంచిందని రోహిత్ తెలిపాడు. తమ బ్యాటింగ్ విభాగం బాగానే ఉందనుకుంటున్నానని, కాకపోతే కీలక సమయంలో విఫలమయ్యాయని పేర్కొన్నాడు. నాలుగేళ్లలో రెండు ఫైనల్స్ ఆడామంటే.. తమ ఆట బాగానే ఉందని అర్థమని చెప్పుకొచ్చాడు. ఈ ఫైనల్ కోసం తాము రెండేళ్లు పాటు కష్టపడ్డామని, వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచి ఫైనల్ దాకా చేరుకున్నామని, కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు తమకు బాగా మద్దతిచ్చారని, ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నాడు. ఇది తమకు ఓ గుణపాఠమన్న రోహిత్.. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మరింత స్ట్రాంగ్‌గా వస్తామని అన్నాడు.