Travis Head: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
Read Also: TDP-JanaSena Meeting: రేపట్నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు
Also Read
- Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ఈ జాబితాలో గ్లెన్ మాక్స్‌వెల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లో సెంచరీ చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు మ్యాక్స్‌వెల్‌పై ఉంది. 2015 ప్రపంచకప్‌లో శ్రీలంకపై మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. మ్యాక్స్‌వెల్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఉన్నాడు. 2013లో బెంగళూరు వన్డేలో టీమిండియాపై ఫాల్క్‌నర్ 57 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ 59 బంతుల్లో సెంచరీ సాధించి తన పేరును నాలుగో స్థానంలో నమోదు చేసుకున్నాడు.
Read Also: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..
గత కొన్ని రోజులుగా గాయం కారణంగా.. ట్రావిస్ హెడ్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చిన ట్రావిస్.. ఈరోజు మొదటి మ్యాచ్ ను ఆడేందుకు అవకాశం లభించింది. తాజా ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యం సరిగా లేకపోవడంతో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. అయితే ట్రావిస్ తిరిగి జట్టులోకి చేరడంతో ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ జోడీ సమస్య పరిష్కారమైంది.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?