Travis Head and Rachin Ravindra likely to get huge price in IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడింది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో మినీ వేలం జరగనుంది. అన్ని ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటికే కసరత్తు చేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ వేలంలో ఐదుగురు ఆల్‌రౌండర్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది. ఇందులో ఓ భారత ప్లేయర్ ఉన్నాడు.
ట్రావిస్ హెడ్:
ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేయడమే కాకుండా.. సెమీ ఫైనల్‌లో బంతితో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం హెడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ఈసారి వేలంలో అతడికి కోట్లు కురవనున్నాయి. ఈసారి రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో హెడ్ రిజిస్టర్ చేసుకున్నాడు.
రచిన్ రవీంద్ర:
న్యూజిలాండ్‌కు చెందిన యువ స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర. ప్రపంచకప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ లిస్టులో నిలిచాడు. అంతేకాదు బంతితో వికెట్లు కూడా పడగొట్టాడు. దూకుడుగా ఆడడం, స్పిన్ బౌలింగ్ చేయడం ఇతడికి కలిసొచ్చే అంశం. ఈ లెఫ్ట్ హ్యాండర్ కోసం అన్ని జట్టు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
పాట్ కమిన్స్:
ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సహా వన్డే ప్రపంచకప్ 2023 కూడా గెలిచింది. కమిన్స్ ఫాస్ట్ బౌలర్ అయినా.. ఐపీఎల్ టోర్నీలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. ప్రపంచకప్ 2023లో రాణించిన ఈ ఆసీస్ ఆటగాడు కోట్ల రూపాయలు దక్కించుకోవచ్చు.
Also Read: Bigg Boss7 Telugu : రన్నర్ గా అమర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా? ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే..
శార్దూల్ ఠాకూర్:
ఈ వేలంలో భారీ ధర పలికే జాబితాలో భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. ఠాకూర్ వికెట్లు తీయడమే కాకుండా.. లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు కొట్టగలడు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు శార్దూల్ ఆడాడు. ప్రస్తుతం శార్దూల్ పెద్దగా రాణించకున్నా.. ఈ భారత ఆల్‌రౌండర్‌పై డబ్బు కురిసే అకాశం ఉంది.
అజ్మతుల్లా ఒమర్జాయ్:
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్. వన్డే ప్రపంచకప్ 2023లో అజ్మతుల్లా అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడమే కాకుండా.. బంతితో వికెట్లు తీశాడు. అద్భుతమైన ఫినిషింగ్, ఫాస్ట్ బౌలింగ్‌కు కూడా అజ్మతుల్లా పేరుగాంచాడు. దాంతో ఈ ఐపీఎల్ వేలంలో అజ్మతుల్లా కోసం ప్రాంఛైజీలు ఎగబడే అవకాశం ఉంది.