AUS vs NZ Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టామ్ లాతమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా దూరమైన మార్క్ చాప్‌మన్ స్థానంలో జిమ్మీ నీషమ్ ఆడుతున్నాడు. మరోవైపు ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్ స్థానంలో హెడ్ ఆడుతాడు.
ఈ మ్యాచ్ న్యూజీలాండ్ కంటే ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం. ఎందుకంటే సెమీస్‌కు మరింత చేరువ కావాలంటే.. న్యూజీలాండ్‌పై విజయం తప్పనిసరి. ఆసీస్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్న విషయం తెలిసిందే. భారీ విజయాలు సాధిస్తూ మైనస్‌లో ఉన్న రన్ రేట్‌ను ప్లస్‌లోకి తీసుకొచ్చింది. ఆసీస్ ఫామ్ బాగానే ఉన్నా.. కివీస్ పటిష్టంగా ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. నాలుగు విజయాలు సాధించిన న్యూజీలాండ్ ఐదవ విజయంపై కన్నేసింది.
తుది జట్లు:
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.