Travis Head Said Rohit Sharma probably the unluckiest man in the world: ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అని ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. రోహిత్ క్యాచ్ పట్టడం, సెంచరీ చేయడం.. ఇవేవీ తాను అస్సలు ఊహించలేదన్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉందని హెడ్ తెలిపాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ క్యాచ్ పట్టడంతో పాటు లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన హెడ్.. ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ 2023 గెలవడంతో కీల పాత్ర పోషించాడు. ప్రస్తుతం హెడ్ ఆస్ట్రేలియా హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన ఫైనల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం హెడ్ సంతోషంలో మునిగిపోయాడు. ‘నా కెరీర్‌లో ఇలాంటి ఓ అసాధారణమైన రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇంట్లో సోఫాలో కూర్చోవడం (గాయం అయినపుడు) కంటే.. ఇది చాలా బాగుంది. ఆస్ట్రేలియా విజయంలో నా భాగం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆడిన మొదటి 20 బంతులు నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. నేను దానిని కొనసాగించగలిగాను. మిచెల్ మార్ష్ వచ్చి గేమ్‌ను ఆడిన విధానం సూపర్. దానిని మేం కంటిన్యూ చేయాలనుకున్నాం’ అని హెడ్ తెలిపాడు.
Also Read: Rohit Sharma: దానిని సాకుగా చూపించలేను.. ఓటమిని ఒప్పుకున్న రోహిత్ శర్మ!
‘మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాక వికెట్ కఠినంగా ఉందని అర్ధం అయింది. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయడం గొప్ప నిర్ణయం. మ్యాచ్ గడిచే కొద్దీ వికెట్ మెరుగైంది. పిచ్ మధ్యలో కొద్దిగా స్పిన్‌కు అనుకూలించింది. సెంచరీ చేయడం, రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం నేను ఊహించలేదు. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు రోహితేనేమో. ఫైనల్స్‌లో సెంచరీల జాబితాలో చేరినప్పుడు (రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ మరియు హెడ్) మూడవ స్థానంలో ఉన్నాను. ఇలా దిగజాల సరసన చేరడం సంతోషకరం. మొత్తంగా నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ట్రావిస్ హెడ్ చెప్పాడు.