రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. త్రైమాసిక టాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు…
License Cancellation: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతం చెబుతూ మందుబాబులు లిక్కర్ సేల్స్ ను టాప్ లో నిలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టిపెట్టింది పోలీస్, రవాణా శాఖ. శనివారం హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. దాదాపుగా చాలా చోట్ల మందుబాబులు పట్టుబడ్డారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాఖ హైసెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది. అయితే ఇకపై అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల బిగింపు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నంబర్ ప్లేట్ల ద్వారా అదనంగా రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాలు ఉండగా అందులో సగం…
ఏపీ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గణనీయంగా పెంచుతూ గురువారం రాత్రి రవాణా శాఖ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గరిష్టంగా రూ. 2 లక్షలు, కనిష్టంగా రూ. 5 వేల వరకు రవాణా శాఖ ప్రతిపాదించింది. పెంపు కారణంగా ఏడాది కాలానికి రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 9999…
విజయవాడలో రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతృత్వంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ కు వినతి పత్రం ఇచ్చింది లారీ యజమానుల సంఘం. రాష్ట్రంలో లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మంత్రి విశ్వరూప్. లారీ యజమానులిచ్చిన వినతి పత్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. విభజనతో మిగులు…
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. దీంతో.. బస్సుల సంఖ్య మరంత తగ్గిపోనుంది.. నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను నడపొద్దంటూ రవాణా శాఖ ఇచ్చిన నోటీస్‌లతో బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరిగాయి. ఇందులో 3,107 అద్దె బస్సులున్నాయి. కాలంచెల్లినందున సంస్థ సొంత బస్సుల్లో కాలంచెల్లిన 600…