Ponnam Prabhakar: రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి.. అధికారులకు సూచన
- రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం
- రవాణా శాఖలో చట్టానికి లోబడి రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోండి
- స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తనిఖీలు నిర్వహించాలి
- ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేసి చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలి
- రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. త్రైమాసిక టాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. 100 శాతం పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను అభినందించారు. సమావేశానికి రాని అధికారులపై నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ మంత్రిగా మొదటిసారి డిటిసిలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అధికారులు హుందాగా వ్యవహరిస్తూ, రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు కావల్సిన సొంత భవనాల కోసం ల్యాండ్ సెర్చ్ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించి సొంత భవనాల సమస్య పరిష్కారించుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. ఆదాయ అన్వేషణలో విచక్షణ రహితంగా వేధింపుల వల్ల కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. జిల్లాల్లో విధిగా వాహనాలు తనిఖీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని సూచించారు.
Also Read
- Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
అధికారులు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుతం ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాలను ఒకే గూటికి తీసుకొచ్చే విధంగా స్టిక్కరింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. రోడ్డు భద్రత పై రవాణా శాఖ అన్ని స్కూల్స్, కాలేజీల్లో రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని డ్రైవర్లకు, స్కూల్ బస్సులకు కచ్చితంగా ఫిట్నెస్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రత పై రవాణా శాఖ అధికారులు జిల్లాలో కలెక్టర్ ప్రాభవిక వ్యక్తులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల పాటు స్కూల్ లు, కాలేజీల్లో ఈ కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి రోడ్డు భద్రత పై కనీస అవగాహన ఉండేలా చూసుకోవాలన్నారు.
Delhi: దేశ రాజధానిని వేధిస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు
స్కూల్ బస్సుకి సంబంధించి డ్రైవర్, క్లీనర్ బస్సు సమయాలు తెలిపే విధంగా.. ప్రతి పాఠశాల యాజమాన్యం స్కూల్ బస్ యాప్ లో అప్డేట్ చేస్తే పూర్తి సమాచారం తల్లిదండ్రులకు తెలిసేలా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పాటు గతంలో కారు డోర్ లకు బ్లాక్ ఫిలిం గ్లాస్ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టులను ఎన్ఫోర్స్ మెంట్ను మరింత బలపరిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. సీజ్ అయిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలని వాహనాలను భద్రపరిచే ప్రదేశలపై జిల్లా పోలీస్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. హైదరాబాదు ఆటో రిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సిఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డిసెంట్రలైజ్ ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఏదైనా భిన్న ఆలోచన వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
తాజావార్తలు
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!