Ola Uber Services: 3రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Uber Services: ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. ఈ మూడు హైరింగ్ సర్వీసులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని చార్జీలను భారీ పెంచాయి. దీంతో మూడు రైడ్ హైరింగ్ సంస్థలు ఏఎన్ఐ టెక్నాలజీస్(ఓలా పేరెంట్ సంస్థ), ఉబర్, ర్యాపిడోలకు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో సర్వీసులను నిలిపి, నివేదిక పంపాల్సిందిగా కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా ఈ సంస్థలు కనీస చార్జీల కింద 100రూపాయలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు కర్నాటక ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశారు.
బెంగళూరులో మినిమమ్ ఆటో ఛార్జీని తొలి రెండు కిలోమీటర్లకు రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత కిలోమీటర్‌కి రూ.15 చొప్పున పెరుగుతూ వెళ్తుంది. కానీ ఈ రైడ్ హైరింగ్ సంస్థల ఛార్జీలు రెండు కి.మీలకే కనీసం రూ.100 ఛార్జీ విధిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అత్యధికంగా ప్రయాణికుల వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి వీలులేదని తెలిపింది. ఆటో సర్వీసుల మూడు రోజుల్లోగా ఆపివేయాలని ఆదేశించిన ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్.. ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. కర్నాటక ఆన్ డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్, 2016 కింద కేవలం ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రం లైసెన్సులను మంజూరు చేస్తున్నట్టు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ టీహెచ్‌ఎం కుమార్ తెలిపారు. ఈ రూల్స్ ఆటోలకు అప్లయ్ కావని పేర్కొన్నారు.
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
Read Also: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు
ట్యాక్సీలంటే.. డ్రైవర్‌ను మినహాయించి ఆరుగురికి మించి కూర్చునేందుకు వీలు లేని సీటింగ్ సామర్థ్యం ఉన్న మోటార్ క్యాబ్ అని టీహెచ్‌ఎం కుమార్ తెలిపారు. పైన పేర్కొన్న రెగ్యులేషన్స్‌ను అతిక్రమించి, ఈ వెహికిల్ అగ్రిగేటర్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులను అందజేస్తున్నాయని అన్నారు. క్యాబ్ అగ్రిగేటర్ లైసెన్సులతో ఆటో రిక్షాలను నడపడానికి వీలు లేదని స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ సెక్రటరీ, ట్రాన్స్‌పోర్టు అదనపు కమిషనర్ ఎల్ హేమంత్ కుమార్ అన్నారు. అగ్రిగేటర్ రూల్స్ కేవలం క్యాబ్‌లకు మాత్రమేనని తెలిపారు. యాప్‌ల ద్వారా అందిస్తున్న ఆటో రిక్షా సర్వీసులను ఆపేయాలని తాము ఆదేశించామని, వెంటనే దీనిపై రిపోర్టు సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!