RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Vehicle Life Tax : తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్‌టాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం.53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు రెండు, మూడు, నాలుగు చక్రాల నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్‌టాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రూ.50 వేలు లోపు ధర కలిగిన రెండు చక్రాల వాహనాలపై…
ACB Rides: ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇతర ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల సహా మొత్తం 8 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పుప్పాల శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ…
Transport Deportment: సంక్రాంతి పండుగా సందర్భంగా రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ పై భారీగా దాడులు నిర్వహించింది. జనవరి 6 నుండి 18 వరకు, హైదరాబాద్ నగరవ్యాప్తంగా 317 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు బేస్డ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖ కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై భారీగా జరిపిన చలాన్లు వసూలు చేసింది. మొత్తం లక్షా 11 వేల…
Warangal: వరంగల్ జిల్లాలో రవాణాశాఖలోని ఆర్టీఓ గంధం లక్ష్మిపై విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, ఆర్టీఓ గంధం లక్ష్మితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సమయంలో రవాణా శాఖ…
రవాణా శాఖ నూతన లోగోను, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై సీఎం రేవంత్ రెడ్డి బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలకు సీఎం హాజరయ్యారు.
Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన…
తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖలు ఉద్యోగుల బదిలీలకు గైడ్‌లైన్స్ జారీ చేస్తు్న్నాయి. రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. రవాణా శాఖలోని ఉద్యోగ సంఘాలు ఏవీ కోరకుండానే బదిలీల్లో గైడ్ లైన్స్ జారీ అయినట్లు తెలిసింది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు.