డిజిటల్ లావాదేవీలు భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాన మంత్రి బుధవారం మాట్లాడారు.
నేటి కాలంలో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు రికార్డు సృష్టిస్తోంది. అక్టోబర్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి మే నెలలో ఆధార్ ఆధారిత ముఖ-ప్రామాణీకరణ ద్వారా 1.06 కోట్ల లావాదేవీలు జరిగాయి.
మన దేశంలో క్రెడిట్ కార్డులను బీభత్సంగా వాడేస్తున్నారు. దీంతో ఒక్కనెలలోనే రూ.లక్ష కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయని చెప్పేందుకు ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయపడింది. మే నెలలో దేశంలో రూ.1.25 ల