PM Modi: డిజిటల్ లావాదేవీలు భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాన మంత్రి బుధవారం మాట్లాడారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కెల్లా భారతే అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఇండియాలో జరుగుతున్న యూపీఐ సేవలను ప్రధాని ప్రశంసించారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి దక్షిణఫ్రికా (South Africa)లో నిర్వహించిన ‘బ్రిక్స్’ (BRICS) సదస్సులో దేశ ప్రధాని మోదీ (Narendra Modi) మాట్లాడారు. రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని స్పష్టం చేశారు.
Read Also: Software Job: గంట పనికి కోట్లలో జీతం.. ఇదెలా సాధ్యం?
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తమ సంకల్పం అని అన్నారు. 15వ బ్రిక్స్ దేశాల వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్‌ను అభినందించారు. పదేళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించంటంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ పాత్ర కీలకమైనదని తెలిపారు. అనంతరం యూపీఐ (UPI) సేవల గురించి ప్రధాని తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘సింగిల్ క్లిక్’ విధానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకత పెరిగి, మధ్యవర్తిత్వం, అవినీతి తగ్గు ముఖం పట్టిందన్నారు. చిన్న దుకాణం నడిపే వారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహించే వారి వరకూ అందరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటిల్లో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోన్న దేశం భారత్ అని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపుర్ (Singapore), ఫ్రాన్స్ (France) దేశాల్లో కూడా ఈ సేవల్ని అందిపుచ్చుకోనున్నట్టు ప్రధాని తెలిపారు. అయితే బ్రిక్స్‌లోని దేశాలు కూడా ఈ సేవలు వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి వస్తువులు మరియు సేవల పన్ను (GST) వంటి సంస్కరణలను తీసుకురావడంలో తమ ప్రభుత్వ రికార్డు గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజా-సేవ డెలివరీలో మెరుగుదల మరియు అవినీతి తగ్గింపు గురించి కూడా మోడీ ప్రస్తావించారు. UPIలో బ్రిక్స్ దేశాలతో సాధ్యమైన సహకారాన్ని ప్రధాని మోడీ ప్రతిపాదించారు.