Hyderabad: హైదరాబాద్ లోని మణికొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వారిని అలువేలు (40), లాస్య (14) గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సదానందం, అలివేలు దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. సదానందం ఉద్యోగం మానేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నట్లు స్తానికులు చెబుతున్నారు. కుటుంబంలో ఇటీవల చిన్ని చిన్న గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తల్లి అలివేలు తన కూతురు లాస్య (14) కి ఉరి వేసి చంపి… ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిదేళ్ళ కొడుకు గాఢ నిద్రలో ఉండడంతో తనను చంపే ప్రయత్నాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి తీవ్ర మానసిక వేదనలో తల్లీ కూతురు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. కరోనా సమయం నుంచి ఇంటి నుంచి తల్లి అలివేలు బయటికే రాలేదని చెబుతున్నారు.
Read Also:Gudivada Amarnath: కేసీఆర్ ఓసారి అచ్యుతాపురం రండి.. ఎకరా రేటు ఎంతో తెలుస్తుంది..
ఈమెతో పాటు కూతురు లాస్య కూడా రెండేళ్లుగా ఇంటికే పరిమితమైంది. ప్లాన్ ప్రకారమే పిల్లలు చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు భర్త సదానందంను దూరంగా పంపిందని తెలుస్తోంది. భర్తకు రూ. 5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆత్మహత్య చేసుకున్న తల్లీ కూతుర్లు చేతులపై కొన్ని వ్యాక్యాలు గోరింటాకుతో రాసుకున్నారు. కూతురు చేతి పై do something that make you happy అని, The game is started అని రాసుకున్నారు.
ఆత్మహత్య కి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఈవిషయంపై రాయదుర్గం సీఐ మహేష్ వివరణ ఇస్తూ లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. రెండేళ్లుగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు.. ఇంటి పక్కన వాళ్ళతో కూడా మాట్లాడటం లేదని చెప్పారు. ఆత్మహత్య కి ముందు.. తల్లీ కూతుళ్లు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టుతుండగా ప్రశ్నించిన కొడుకును నీకేం తెలియని వారించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. తల్లీ కూతుళ్ల ఆత్మహత్యపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Also:PM Modi Speech: 58 నిమిషాల్లో 79 సార్లు చప్పట్లు.. పార్లమెంట్ను ఊపేసిన మోడీ మేనియా