తెలంగాణ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కామన్. ప్రతి నాయకుడు….తనకు కావలసింది సాధించుకోవడం కోసం వ్యూహాలు వేస్తుంటారు. ఇటు కోమటిరెడ్డి నుంచి మొదలుకుని…ప్రేమ్ సాగర్ వరకు…ఎవరి వ్యూహం వారికి ఉంది. మరి…అదిలాబాద్ పంచాయితీ వెనక అసలు వ్యూహం ఏంటి!?
అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు…మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్య పంచాయుతీనే రచ్చకు కారణం అవుతుందా?మహేశ్వర్ రెడ్డి…ఇంద్రవెల్లి సభ కంటే ముందు రచ్చ చేశారనే…ప్రేమ్‌సాగర్ వివాదం మొదలైందా?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ప్రేమ్ సాగర్ రావు…మహేశ్వర్ రెడ్డి మధ్య సయోధ్య లేదు. ఇద్దరు ఒకరికి ఒకరు చెక్ పెట్టుకోడానికి ఇది ఎత్తుగడగా వాడుకుంటున్నారనే ప్రచారం పార్టీలో ఉంది. ప్రేమ్‌సాగర్ రావు…స్థానిక పార్టీ కమిటీల్లో పాత వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఏంటనే వాదనలు ఉన్నాయి. రాయబారానికి వెళ్ళిన నాయకుల వద్ద ప్రేమ్‌సాగర్ రావు తీస్తున్న ప్రస్తావనలు ఏంటి?ఇలా ఒక్కొక్కరు…ఒక్కో వ్యూహంతో ఉంటే…పార్టీ నడవడం ఎలా అనేదే…అసలు ప్రశ్న.
వాయిస్-తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు పిసిసిని టార్గెట్ చేస్తూ…మరికొందరు పార్టీ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. పిసిసిలో ఇప్పటికే ఐదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఉన్నాయి. కొత్తగా…పదవులు ఆశిస్తున్న వారిలో బలరాం నాయక్…ప్రేమ్‌సాగర్ రావులు ఉన్నారు. ప్రేమ్‌సాగర్ రావు మొదటి నుంచి…వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నారు. లోకల్ నాయకుల పంచాయతీ ఒక ఎత్తయితే…వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై గతంలో పార్టీ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపై పార్టీలో అసలు చర్చ లేకుండా పోయింది. బుజ్జగింపులు కోసం వెళ్ళిన నాయకుల వద్ద పదవుల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఐదు వర్కింగ్ ప్రెసిడెంట్ అంశంలో నేతల మధ్య సయోధ్య లేదు. ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఆ పదవి కోసమే అనే టాక్ మొదలైంది. సంప్రదింపులు చేస్తున్న నాయకుల వద్ద వచ్చిన ప్రస్తావన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వద్దకు వెళ్లిందట. ఐతే…దీనిపై ఆయన సైలెంట్ అయ్యారట. మొత్తానికి కాంగ్రెస్‌లో పంచాయతీలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. అసలీ రచ్చ ఎటు వెళ్తుందనేది చూడాలి.