ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? కాంగ్రెస్ తర్జన భర్జన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు.. రేపటిలోగా అన్ని జిల్లాల నాయకులు చర్చించుకుని సమగ్ర సమాచారాన్ని పీసీసీకి ఇవ్వాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ క్యాంపెయిన్‌పై చర్చించారని చెబుతున్నారు.. జిల్లాల్లో డిజిటల్ మెంబెర్షిప్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అందుకు ఆయా జిల్లాల ఇంఛార్జీలుగా ఉన్న వర్కింగ్ ప్రసిడెంట్స్, వైస్ ప్రసిడెంట్స్ క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించింది పీఏసీ.
Read Also : గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం..
Also Read
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టుగా తెలుస్తోంది.. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తిచేసినట్టు తెలుస్తుండగా.. ఇవాళో.. రేపు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.. నామినేషన్లకు కూడా సమయం దగ్గర పడుతోంది.. ఈ సమయంలో.. పోటీపై నిర్ణయం తీసుకోవడానికే ఇంకా తర్జనభర్జన పడుతోంది కాంగ్రెస్ పార్టీ. మరి.. పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..