ఈ నెల 9, 10 తేదీల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఉంటాయని టీపీసీసీవర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.డిజిటల్ సభ్యత్వ నమోదుపై డీసీసీలకు, నియోక జవర్గం నుంచి ఒకరికి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రెండు రోజు ల పాటు కొంపల్లిలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ మేర కు ఏర్పాట్లను మహేష్ గౌడ్ తోపాటు సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేం దర్ రెడ్డి, అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగం, దళిత బంధు లాంటి పథకాల పై చర్చ ఉంటుందని ఆయన తెలిపారు. డీసీసీలతో పాటు..మండల అధ్యక్షులను కూడా సమావేశానికి పిలుస్తున్నాం. ఈ నెల 14 నుండి జన జాగరణ పాదయాత్రలు ఉంటాయన్నారు.
ఇరిగేషన్, వ్యవసాయం రంగం పై అవగాహన తరగతులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి శిక్షణ తరగ తులు ప్రారంభం అవుతాయన్నారు. కోమటిరెడ్డి వ్యవహారం పార్టీ సీని యర్ నాయకుడు వి. హన్మంతరావుకి అప్పగించామన్నారు. వచ్చే పీఏసీ సమావేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చను చేపడతా మన్నారు. ప్రేమ్ సాగర్ రావు తో..సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యద ర్శులు మాట్లాడుతున్నారు రెండు…మూడు రోజుల్లో సమస్య పరిష్కా రం అవుతుంది. ఎవరిని దూరం చేసుకునే ఆలోచన పార్టీ కి లేదని మహేష్‌గౌడ్ అన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం అంతా మాణిక్కం ఠాగూర్ పరిశీలిస్తున్నారని, ప్రేమ్‌సాగర్‌రావు వ్యవహారంపై కూడా ఆయన ఆరాతీస్తున్నారన్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ బోస్ రాజుకు బాధ్యతలు అప్పగించారని, ప్రేమ్‌సాగర్‌రావుతో కొనసాగుతున్న చర్చలు జరుగుతున్నట్టు మహేష్ గౌడ్ తెలిపారు.