ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లో కొంత గ్రూప్ వార్ నడిచిన విషయం తెలిసిందే. నాయకులూ రెండు గ్రూపులుగా విడిపోయి మరి విమర్శించుకున్నారు. కానీ ఇప్పుడు అంత సద్దుమణిగినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సమావేశంలో హుజరాబాద్ ఎన్నికల ఫలితం, సంబంధిత ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది అని సి.ఎల్.పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పోరాడుతాం అని తెలిపారు. 2023 ఎన్నికలకోసం “యాక్షన్ ప్లాన్” సిధ్దం చేస్తున్నాం. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ నాటకాలు ఆడుతున్నాయి అని చెప్పిన ఆయన బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్న నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.