Revanth reddy: తలసానికి అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా అన్నాడు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారని ఎద్దేవ చేశారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని వ్యంగాస్త్రం వేశారు. అరతిపళ్ల బండిదగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్ లు నమిలే వారు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా…
రాష్ట్రంలో అందరి జీవితాలలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలిస్తే వేదిక పైన ఉన్న పెద్దలు రాష్ట్రంలో 90% సీట్లు గెలిపిస్తారు అని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి తెలిపాడు.
కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు, ఇన్‌ఛార్జ్‌ల మార్పు తన పరిధిలోకి రాదన్నారు. టీకాంగ్రెస్‌పై త్వరలోనే స్పష్టత వస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.