టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు సీడబ్ల్యూసీ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి. శ్రీరాముడికి హనుమంతుడిలా.. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి.. రేవంత్ ని చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం.. రాహుల్ గాంధీకి కుడిభుజంలా రేవంత్ పనిచేస్తున్నాడు… రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఖాయం అని జోస్యం చెప్పారు సుబ్బిరామిరెడ్డి.
సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో జరిగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడోయాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతి గడప నుంచి ఈ యాత్రలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలి. బీజేపీ పాలనలో దేశంలో పెరుగుతున్న రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారన్నారు.
Read Also: Tirumala Srivari Brahmotsavam Live: అశ్వవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
భారత్ జోడోయాత్ర దేశంలో చారిత్రాత్మకంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. మత, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఆర్థిక సంపదను కొద్ది మందికే దోచిపెడుతున్న దేశంలోని కార్పొరేట్ పరిపాలనకు స్వస్తి పలకడానికే రాహుల్ భారత్ జూడో యాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పాదయాత్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. దేశ జాతి ఐక్య నిర్మాణానికి చేస్తున్న యాత్ర అన్నారు భట్టి విక్రమార్క. భారత్ ఔన్నత్యాన్ని కాపాడటం కోసమే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారన్నారు.
రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో పాదయాత్ర తమిళనాడు కేరళలో దిగ్విజయంగా విజయవంతం అయింది. కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతున్నది. తమిళనాడు కర్ణాటక కేరళలో కంటే పెద్ద ఎత్తున ఎఫెక్ట్ కనిపిస్తుంది. తెలంగాణలో రాహుల్ యాత్రను విజయవంతం చేద్దామన్నారు.
Read Also: Bellamkonda Ganesh: ఫస్ట్ టెన్ మూవీస్ డిఫరెంట్ జానర్స్ లో!